పఠాన్‌పై నిషేధం.. ప్రదర్శిస్తే మూడేళ్ల జైలు

34
- Advertisement -

బాలీవుడ్ బాదుషా షారుఖ్ ఖాన్ చాలా కాలం తర్వాత ‘పఠాన్’ మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. తొలుత వివాదాలకు కేంద్రబిందువైన ఈ మూవీ రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఉన్న బాలీవుడ్‌ రికార్డులను బ్రేక్ చేసింది.

అయితే ఈ చిత్రంపై పాకిస్తాన్ నిషేధం విధించింది. సింధ్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్స్ సెన్సార్ (SBFC) ఈ చిత్రాన్ని పదర్శించేందుకు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ పలు చోట్ల ఫైర్ వర్క్స్ ఈవెంట్స్ అనే సంస్థ ఈ చిత్రాన్ని రహస్యంగా ప్రదర్శించారు. ఒక్కో టిక్కెట్ ధర 900ల పాకిస్తాన్ రూపాయలు. ఈ విషయం తెలిసిన సెన్సార్ బోర్డు వెంటనే యాక్షన్ తీసుకుంది.

బోర్డు ద్వారా పబ్లిక్ ఎగ్జిబిషన్ కోసం చిత్రం అనుమతి పొందితే తప్ప ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తే వారికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.100,000 వరకు జరిమానా విధిస్తామని పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -