విమానం అదృశ్యం…కూలినట్టు అనుమానం

114
Pakistani plane Missing

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన పీకే-116 విమానం 47 మంది ప్రయాణీకులతో ప్రయాణిస్తూ ఖైబర్ ఫంక్తూన్ లో గల అబాటోబాద్ సమీపంలో కుప్పకూలింది.

అయితే ఈ విమానం హెవీలియ‌న్ ప్రాంతంలో కొండ‌ను ఢీకొని ఉంటుంద‌ని కొంద‌రు అంచ‌నా వేస్తున్నారు. సాయంత్రం 3.30 నిమిషాల‌కు చిత్రాల్ నుంచి బ‌య‌లుదేరిన విమానం సాయంత్రం 4.40 నిమిషాల‌కు ఇస్లామాబాద్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది. సుమారు 4.30 నిమిషాల ప్రాంతంలో రాడార్ సిగ్నల్స్ తెగిపోయినట్లు అధికారులు తెలిపారు. విమానం కూలిన ప్రాంతం నుంచి దట్టమైన పొగ వస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. స్థానికులు, ఆర్మీ సిబ్బంది సహాయకకార్యక్రమాల్లో పాల్గొన్నట్టు సమాచారం. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.