పాకిస్తాన్‌ హీరో.. కేజ్రీవాల్‌ !

197
Pakistani media hails Arvind Kejriwal as 'hero'
Pakistani media hails Arvind Kejriwal as 'hero'
- Advertisement -

పాకిస్తాన్‌ భూభాగంపై భారత సైన్యం చేపట్టంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయానికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్న విషయం తెలిసిందే. మోదీకి తనకు వంద వివాదాలు ఉండొచ్చు కాక, అయినా తాను మోదీకి సెల్యూట్ చేయలేకుండా ఉండలేక పోతున్నానన్నారు. యురి దాడులు సంబంధించిన వీడియో దృశ్యాలను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ సన్నివేశాలను చూడాలని తన రక్తం తహతహలాడుతోందని తెలిపారు. ఇండియా చేసిన సర్జికల్ దాడులకు పాకిస్థాన్ కొట్టి పడేయడాన్ని ఆయన గుర్తు చేశారు.

అయితే, అదే సమయంలో ఆయన భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ పై ఆధారాలు చూపి పాక్ ఆర్మీ ఆ అంశంపై చేస్తున్న అసత్యప్రచారాన్ని ఎండగట్టాలని మోదీకి విజ్ఞప్తి చేశారు. దీన్ని అసరాగా చేసుకున్న పాకిస్తాన్ మీడియా కేజ్రీవాల్‌ను హీరోని చేసేసింది. ఆధారాలు చూపించాలంటే కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్య‌ల‌ను హైలైట్ చేస్తూ క‌థ‌నాలు ప్ర‌చురించింది. భార‌త సైన్యం అస‌లు స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ చేయ‌నేలేద‌ని పాకిస్థాన్ ఇప్ప‌టికే అస‌త్య‌ప్ర‌చారం చేస్తోంది. స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ చేయ‌లేద‌ని తాము చెబుతున్న అంశానికి కేజ్రీవాల్ వ్యాఖ్యలు బలం చేకూర్చాయని పాక్ మీడియా పేర్కొంది. ‘మోదీని నిలదీసిన హీరో కేజ్రీవాల్’ అంటూ హెడ్డింగులు పెట్టి పాక్ మ‌రింత రెచ్చిపోయింది.

- Advertisement -