టీ20 వరల్డ్‌కప్..పాక్ ఎలిమినేట్

5
- Advertisement -

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026లో పాకిస్థాన్ జట్టు ప్రయాణం ముగిసింది. నిన్న సాయంత్రం జరిగిన కీలక పోరులో పాక్ జట్టు శ్రీలంకపై ఐదు పరుగుల తేడాతో గెలిచినా, నెట్ రన్‌రేట్ కారణంగా టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో భారీగా 207 పరుగులు సాధించింది. పాక్ బౌలర్లు శ్రీలంకను 147 లోపు కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ అది సాధ్యం కాలేదు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. చివరి వరకు పోరాడి ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది.

అయితే గ్రూప్‌లో నెట్ రన్‌రేట్‌లో వెనుకబడిన కారణంగా పాకిస్థాన్‌కు సెమీఫైనల్ అవకాశాలు చేజారాయి. గెలిచినా టోర్నీ నుంచి బయటపడటం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.

Also Read:హైదరాబాద్‌ని కుప్పకూల్చింది రేవంత్ రెడ్డే:కేటీఆర్

ఈ మ్యాచ్ మరోసారి టీ20 ఫార్మాట్‌లో ప్రతి రన్ ఎంత కీలకమో నిరూపించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో విజయం దక్కినా, నెట్ రన్‌రేట్ పాక్ ఆశలను తుడిచిపెట్టేసింది.

- Advertisement -