‘పుష్ప’ నుండి ఆసక్తికర వీడియో..

347
pushpa
- Advertisement -

స్టైలీష్ స్టార్‌ అల్లు అర్జున్‌ తాజా చిత్రంగా ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక వీడియో విడుదల చేశారు చిత్ర బృందం. వెనక్కి విరిచి తాళ్లతో కట్టేయబడిన చేతులతో ‘పుష్పరాజ్’ పారిపోతూ .. తనని తరుముకొచ్చే వాళ్లు ఎంత దూరంలో ఉన్నారన్నది అంచనా వేస్తూ పరిగెత్తడం ఈ వీడియోలో కనిపిస్తోంది. పుష్ప ఫేస్ ను మాత్రం రివీల్ చేయలేదు.

ఇక హీరోని ఎవరు .. ఎందుకు బంధించారు? అనే ఆసక్తిని ఈ వీడియో రేకెత్తిస్తోంది. ఈ నెల 7వ తేదీన సాయంత్రం 6:12 నిమిషాలకు పుష్ప రాజ్ ను పరిచయం చేస్తామని ఈ వీడియో చివర్లో చెప్పారు. ఈ నెల 8వ తేదీన బన్నీ బర్త్ డే రోజున, ఫ్యాన్స్ కోసం ముందురోజునే ట్రీట్ ఇస్తున్నారన్న మాట. కాగా, పుష్పలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న బన్నీతో జతకడుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా, రష్మిక ట్రైబల్ యువతి పాత్రను పోషిస్తోంది.

- Advertisement -