ఆసియా కప్: భారత్ విజయలక్ష్యం 238

202
indian criket team
- Advertisement -

ఆసియా కప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ జట్టు 50 ఓవర్లలో 237 పరుగులు చేసింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌ను భారీ స్కోర్‌ చేయకుండా భారత బౌలర్లు నిలువరించారు. పాక్‌ బ్యాట్స్‌ మెన్లలో షోయబ్‌ మాలిక్‌ (78) సర్పరాజ్‌ అహ్మద్‌ (44)లు రాణించడంతో దాయాది జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

మొదటి ఇన్నింగ్స్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తూ పాక్‌ బ్యాట్స్‌ మెన్‌ను ఒత్తిడికి గురి చేశారు. భారత బౌలింగ్‌ ధాటికి నిలబడలేకపోయిన పాక్‌ బ్యాట్స్‌ మెన్స్‌ వెంట వెంటనే వికెట్లు కోల్పోయారు. ఒక దశలో పాక్‌ జట్టు 58 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకొచ్చిన పాక్‌ జట్టు స్టార్‌ ప్లేయర్లు షోయబ్‌ మాలిక్‌, సర్ఫరాజ్‌లు ఆచితూచి ఆడుతూ భారత బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టడంతో పాక్‌ జట్టు పరుగుల బోర్డు ముందుకు సాగింది. భారత బౌలర్లలో చహాల్‌, కుల్దీప్‌, బుమ్రాలు తలో రెండు వికెట్లు పడగొట్టారు.

పాక్‌ ఉంచిన 238 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత జట్టు చేధిస్తుందో లేదో చూడాలి. భారత జట్టు ఫాన్‌ను చూస్తే ఈ మ్యాచ్‌లో మరోసారి రోహిత్‌ శర్మ జట్టు పాక్‌ను చిత్తుగా ఓడించే అవకాశాలే కనిపిస్తున్నాయి. సూపర్‌ ఫామ్‌లో ఉన్న భారత జట్టు చిరకాల ప్రత్యర్ధి పాక్‌ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసి మరోసారి గెలుపు ముంగిట నిలిచిందనే చెప్పాలి. భారత బ్యాట్స్‌మెన్‌ సమిష్టిగా రాణిస్తే పాక్‌పై భారత జట్టు మరోసారి గెలవడం తధ్యంగానే కనిపిస్తోంది.

- Advertisement -