పాకిస్తాన్ మహిళల జట్టు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారీ ఓటమి పాలై, మహిళల ప్రపంచ కప్ 2025 నుండి నిష్క్రమించింది. ఇదే సమయంలో, దక్షిణాఫ్రికా ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో మొదటిసారిగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.
పాక్ ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఒక్కదానిని కూడా గెలవలేకపోయారు. ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్‌తో వర్షం ప్రభావితమైన మ్యాచ్‌ల ద్వారా వచ్చిన రెండు పాయింట్లతో వారు పాయింట్ల పట్టిక చివరన ఉన్నారు. పాకిస్తాన్ టోర్నమెంట్ నుండి నిష్క్రమించిన రెండవ జట్టు కాగా, మొదటగా బంగ్లాదేశ్ నిష్క్రమించింది.
ఇక భారత్ విషయానికి వస్తే — ఆతిథ్య జట్టు వరుసగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల చేత మూడు మ్యాచ్‌లు ఓడిపోయినా, నాలుగో స్థానంలో నిలిచింది. శ్రీలంక మరియు పాకిస్తాన్‌పై విజయం సాధించి నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది భారత్. న్యూజిలాండ్ జట్టు కొలంబోలో జరిగిన రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయినందున, అది భారత్‌కు కొంత వరకూ లాభించింది. ఎందుకంటే న్యూజిలాండ్…శ్రీలంక మరియు పాకిస్తాన్‌పై గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఒక్కో పాయింట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
భారత్‌కు ఇంకా సెమీఫైనల్‌కు చేరే అవకాశం ఉంది. ఇందుకోసం అక్టోబర్ 23 (గురువారం) న్యూజిలాండ్‌పై తప్పనిసరిగా గెలవాలి. ఈ రెండు జట్లలో ఏ టీం గెలిస్తే ఆ జట్టు సెమీఫైనల్ చేరుతుంది.
Also Read:చాయ్ వాలా ఇంట్లో సోదాలు..షాక్!

