ఎంపీ కిరణ్‌ రెడ్డిపై గాదరి కిషోర్ ఫైర్

10
- Advertisement -

చామల కిరణ్ కుమార్ రెడ్డి కాదు చామలం కిరణ్ కుమార్ రెడ్డి అని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ నేత గాదరి కిషోర్. మీకు ఒక్క సీటు రాలేదని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు … కిరణ్ కుమార్ రెడ్డికి ZPTC టికెట్ ఇవ్వక పోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే వంకాయ గుర్తు ఇస్తే 100 ఓట్లు వచ్చాయి అన్నారు.

వంకాయ గుర్తు మీద పోటీ చేస్తే 100 ఓట్లు వచ్చిన వాడు కూడా మా గురించి మాట్లాడుతున్నాడు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆయన నియోజకవర్గం వరదల్లో మునిగిపోయిందని ఆదుకోవాలని వరల్డ్ బ్యాంక్‌కు లేఖ రాశాడు అన్నారు. నియోజకవర్గానికి డబ్బులు కావాలంటే ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అడగాలి కానీ వరల్డ్ బ్యాంక్‌ను అడుగుతున్నారు అంటే వాళ్ల ముఖ్యమంత్రి, ప్రభుత్వం మీద వాళ్లకే నమ్మకం లేదు అన్నారు.

రేవంత్ రెడ్డి పరువు తీస్తూ నా నియోజకవర్గానికి 100 కోట్లు కావాలని వరల్డ్ బ్యాంక్‌కు లేఖ రాసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గం పూర్తిగా దెబ్బతిందని, ప్రకృతి విపత్తు పరిహారం కింద రూ.100 కోట్లు ఇవ్వాలని కోరారు.

Also Read:‘మైసా’ …గ్లింప్స్ వచ్చేస్తోంది!

- Advertisement -