ఓటు వేసి.. లగ్జరీ హోటల్లో భోజనం చేశారు..

279
-Pakistan
- Advertisement -

పాకిస్తాన్ సాధారణ ఎన్నికలకు నేడు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. రెండు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా అధికారం కోసం పోటీ పడుతున్నాయి. మరోవైపు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని పలు రెస్టారెంట్ల యజమానులు కొత్త ఆఫర్లు పెట్టారు. ఓటు వేసి వచ్చి.. ఉచితంగా తమ హోటల్ లో మీకు ఎంత తినాలనిపిస్తే అంత తినండి.. ఏది తాగాలనిపిస్తే అది తాగండంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు చేశారు.

pakistan elections

ఈ సందర్భంగా ఓ రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ.. ప్రజలను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ప్రయత్నం చేశాం.. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి, మీ చేతిలోనే దేశ భవిష్యత్ ఉంది. ధైర్యంగా వెళ్లండి, మిమ్మల్ని 5 సంవత్సరాలు పాలించే.. మీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోండి. ఓటు వేసి వచ్చి మా రెస్టారెంట్లో ఉచితంగా భోజనం చెయ్యండి.. మీకు నచ్చిన కూల్ డ్రింక్స్ తాగండని, సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో ప్రకటనలు చేశామని తెలిపాడు.

ఇక పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కావాలంటూ ఇప్పటికే పాక్ క్రికెటర్లు, పాక్ ఆర్మీ సైతం ఆయనకు మద్దతుగా నిలిచారు. మరోవైపు నవాజ్ షరీష్ పీఎంఎల్‌ఎన్ పార్టీకి సింపతితో ఓట్లు పడే అవకాశం ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. నవాజ్ షరీఫ్ జైలుకు వెల్లడంతో ఆయనపై ప్రజలలో సింపతి ఉందని చెబుతున్నారు. మరి ఈ రెండు పార్టీలలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో చూడాలి ఇక.

- Advertisement -