Mpox: పాకిస్థాన్‌లో తొలి ఎంపాక్స్‌ కేసు

8
- Advertisement -

ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్‌ వైరస్‌ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు ఈ వ్యాధితో 500 మందికిపైగా మరణించగా వేల సంఖ్యలో వ్యాధి బారిన పడ్డారు. ఇప్పటివరకు 15 ఆఫ్రికా దేశాలకు మంకీపాక్స్ వ్యాపించగా తాజాగా పాకిస్థాన్‌ లో తొలి ఎంపాక్స్‌ కేసు బయటపడింది.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. 34 ఏళ్ల వ్యక్తి సౌదీ అరేబియా నుంచి ఆగస్టు 3వ తేదీన పాకిస్థాన్‌కు వచ్చాడు. అయితే, అతడు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది.

మంకీపాక్స్‌ వైరస్‌ వ్యాప్తి అత్యంత ఆందోళనకర స్థాయికి చేరుకుందని, ఇక్కడి పరిస్థితి అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే విధంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read:‘పొట్టేల్’ ..రిలీజ్ డేట్

- Advertisement -