వారిపై చర్యలుండవా…? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాక్ పత్రిక

210
Pakistan daily 'The Nation' asks Islamabad
Pakistan daily 'The Nation' asks Islamabad
- Advertisement -

అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ పరువు తీస్తున్న జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్, జమాతే ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ లపై సైన్యం, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రముఖ పాక్ పత్రిక ‘ది నేషన్’ ప్రశ్నించింది. పాక్ సైన్యం, ప్రభుత్వం మధ్య విభేదాలున్నాయని ‘డాన్’ పత్రిక జర్నలిస్టు సిరిల్ అల్ మైడా ప్రత్యేక కథనాన్ని రాసిన తరువాత, ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ సంపాదకీయం ప్రచురితం కావడం పాక్ ప్రభుత్వ వర్గాల్లో సంచలన రేకెత్తిస్తోంది.

హక్కానీ నెట్‌వర్క్‌, తాలిబన్‌, లష్కరే తయిబా నేతలకు రహస్యంగా అందిస్తున్న మద్దతును నిలిపివేయాలంటూ శక్తిమంతమైన సైన్యాన్ని, ఐఎస్‌ఐ(గూఢచర్య సంస్థ)ని పౌర ప్రభుత్వ అధికారులు సదరు సమావేశంలో హెచ్చరించారంటూ ఈ కథనంలో పేర్కోంది. అజర్, సయీద్ వంటి వారిపై చర్యలు తీసుకోవడం మానేసి పత్రికలకు పాఠాలు చెబుతోందని ఆరోపించింది. కాగా, పఠాన్ కోట్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ మసూద్ అజర్, 2008 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌లకు పాక్ సైన్యమే భద్రతను కల్పిస్తోందన్న విషయమూ బహిరంగ రహస్యమే. ఈ విషయంలో తమ విధిని పక్కనబెట్టిన ప్రభుత్వం, సైన్యం మీడియా చేయాల్సిన పనులపై పాఠాలు చెప్పాలని చూడటం భావ్యం కాదని ‘ది నేషన్’ అభిప్రాయపడింది.

ఉగ్రవాదులకు అండగా నిలిచే అంశంపై పాకిస్థాన్‌ పౌర ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య తలెత్తిన విభేదాలను బయటపెట్టిన ఓ పాత్రికేయుడిపై పాక్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దేశం విడిచి వెళ్లకుండా ఆయనపై మంగళవారం నిషేధం విధించింది. దీంతో ప్రభుత్వానికి నిరసనల సెగ తాకుతోంది.

- Advertisement -