ఆఫ్గానిస్తాన్‌పై పాక్ వైమానిక దాడులు

5
- Advertisement -

ఆఫ్గానిస్తాన్‌పై వైమానిక దాడులతో విరుచుకపడింది పాకిస్తాన్. కాబూల్‌లోని ఆసుపత్రిపై భారీ దాడి జరిగి 400 మంది మృతి, 250 మంది గాయపడ్డారని తాలిబాన్ వెల్లడించింది. ఈ దాడిలో మాదకద్రవ్యాల చికిత్స కేంద్రంగా పనిచేస్తున్న ఆసుపత్రి ధ్వంసమైందని అఫ్గాన్ అధికారులు తెలిపారు. అయితే పాకిస్తాన్ మాత్రం పౌరులపై దాడి చేయలేదని, మిలిటెంట్ మౌలిక వసతులనే లక్ష్యంగా చేసుకున్నామని పేర్కొంది.

అఫ్గానిస్తాన్ ఉప ప్రభుత్వ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ మంగళవారం ఉదయం ఎక్స్‌లో పోస్టు చేస్తూ, సోమవారం రాత్రి జరిగిన ఈ దాడిలో మరణాల సంఖ్య 400కి చేరిందని తెలిపారు. సుమారు 250 మంది గాయపడ్డారని చెప్పారు. ఆసుపత్రి ధ్వంసమైందని, శిథిలాల్లో నుంచి మృతదేహాలను వెలికితీసే పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఇక పాకిస్తాన్ మాత్రం ఆసుపత్రిపై దాడి జరగలేదని ఖండించింది. తమ వైమానిక దాడులు కేవలం మిలిటెంట్ స్థావరాలు, ఆయుధ నిల్వలు, ఉగ్రవాద మద్దతు మౌలిక వసతులపైనే జరిగినట్లు స్పష్టం చేసింది. పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపింది.

ఈ ఘర్షణలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఉగ్రవాదాన్ని ఖండిస్తూ, అఫ్గానిస్తాన్‌లో భద్రతా చర్యలు బలోపేతం చేయాలని పిలుపునిచ్చింది.

Also Read:పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీస్

- Advertisement -