పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీస్

8
- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వ్యవహారంపై కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ శివార్లలో జరిగిన ఒక సమావేశంలో మాదకద్రవ్యాల వినియోగం జరిగినట్లు మీడియాలో వచ్చిన ఆరోపణలను పార్టీ అత్యంత గంభీరంగా తీసుకుంది.

ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్, రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లోగా ఆరోపణలపై స్పష్టమైన లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అంతవరకు ఆయనను పార్టీ కార్యకలాపాల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది.

పార్టీకి నష్టం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. క్రమశిక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గడువులోపు సరైన వివరణ ఇవ్వకపోతే పార్టీ నియమావళి ప్రకారం మరింత కఠినమైన చర్యలు, అవసరమైతే బహిష్కరణ కూడా ఉండవచ్చని సంకేతాలు ఇచ్చింది.

ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ ప్రతిష్టను కాపాడటంలో భాగంగా తీసుకున్న ఈ చర్యలు భవిష్యత్తులో ఇతర నాయకులకు కూడా హెచ్చరికగా భావిస్తున్నారు.

Also Read:OTT:ఈ వారం ఓటీటీ సినిమాలివే

- Advertisement -