అడ్డంగా దొరికిపోయిన పాక్ ప్రధాని..!

10
- Advertisement -

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ సోషల్ మీడియాలో చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. ఇరాన్‌కు విధించిన డెడ్‌లైన్‌ను పొడిగించాలంటూ చేసిన ఆ ట్వీట్, పోస్ట్ చేసిన విధానం కారణంగా ట్రోల్స్‌కు గురైంది.

ప్రధాని షెహబాజ్ షరీఫ్ తొలుత “Draft-Pakistan’s PM Message on X” అనే టైటిల్‌తో ట్వీట్ చేశారు. సాధారణంగా అంతర్గతంగా తయారుచేసే డ్రాఫ్ట్ మెసేజ్‌ను పొరపాటున నేరుగా పోస్ట్ చేసినట్లు ఈ టైటిల్ ద్వారా స్పష్టమైంది. కొద్ది సేపటికే ఆయన ఆ ట్వీట్‌ను ఎడిట్ చేసినప్పటికీ, అప్పటికే స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “ఎవరో పంపిన మెసేజ్‌ను కాపీ పేస్ట్ చేశారా?” అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఈ మెసేజ్ అమెరికా నుంచి వచ్చి ఉండొచ్చని, పాకిస్థాన్ ప్రభుత్వం స్వతంత్రంగా కాకుండా ఇతర దేశాల ప్రభావంలో పనిచేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అంతేకాకుండా, యునైటెడ్ స్టేట్స్ ప్రభావం పాకిస్థాన్ విదేశాంగ విధానంపై ఎంతవరకు ఉందనే అంశంపై కూడా చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో పలువురు యూజర్లు, “పాక్ అమెరికా చేతిలో కీలుబొమ్మలా మారింది” అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ వివాదంపై అధికారికంగా పాకిస్థాన్ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.

- Advertisement -