నందమూరి బాలకృష్ణ – పూరి జగన్నాథ్ ల సెన్సేషనల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘పైసా వసూల్’. భవ్య క్రియేషన్స్ పతాకం పై వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి , ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుపుకుంటోంది .అది కూడా ఈ వారంలోనే పూర్తి కానుంది. ఈ నెల 28న ‘పైసా వసూల్’ కి సంబంధించిన ‘స్టంపర్’ ని విడుదల చేయనున్నారు.
ఈ మూవీ ఫస్ట్ లుక్స్ ను పూరీ జగన్నాథ్, కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేశారు. చిత్రం ‘స్టంపర్’ ఈ నెల 28న ఉదయం 10.22కు విడుదల చేస్తామని చెబుతూ ‘స్టంపర్ కా బాప్’, ‘టీజర్ కా బేటా’ అంటూ 24 సెకన్ల నిడివి వున్న ఫోటోలతో కూడిన వీడియోను ఆయన విడుదల చేశాడు. ఇందులో బాలయ్య గడ్డంతో స్టన్నింగ్ లుక్స్ తో కనిపిస్తుండటం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విడుదలైన నిమిషాల్లోనే దీన్ని వేల మంది చూసేశారు.
శ్రీయ,ముస్కాన్, కైరా దత్, అలీ,పృథ్వి ,పవిత్రా లోకేష్ ,విక్రమ్ జిత్ తదితరులు నటించిన ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ -బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ ఒక ప్రత్యేక పాత్ర ధరించారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్.
What is Stumper101 ?? Check this out! #NBK101Fever #PaisaVasool #NBK101 #Stumper101on28th @purijagan @BhavyaCreations pic.twitter.com/cri2vE7VPU
— Paisa Vasool (@PaisaVasool_NBK) July 26, 2017