నందమూరి బాలకృష్ణ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పైసా వసూల్. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అనుకున్న సమయం కంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ రేపు సాయంత్రం ఖమ్మంలోని ఎస్ ఆర్ అండ్ బిజిఎన్ ఆర్ గ్రౌండ్ లో గ్రాండ్ గా జరగనుంది. అతిరథమహారథులు ఈ వేడుకుకు హాజరుకానున్నారు.
సెప్టెంబర్ 29న మూవీ విడుదలవుతుందని ముందుగా చెప్పినప్పటికి , షూటింగ్ త్వరగా పూర్తి కావడంతో సెప్టెంబర్ 1న రిలీజ్ డేట్ గా ప్రకటించారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఔట్ అండ్ ఔట్ మాస్ మాసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై బాలయ్య అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా స్టంపర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టైటిల్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ‘నే అడుగెడితే.. షో మొదలెడితే.. అరె గుండీలు తీసి కాలరు ఎగరేస్తే..’ అంటూ సాగే ఈ పాట నందమూరి అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
శ్రేయ, ముస్కాన్, కైరాదత్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అలీ, పృథ్వీ, విక్రమ్జిత్ సహా బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ ఇందులో ప్రత్యేక పాత్ర పోషించారు. భవ్య క్రియేషన్స్ బేనర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.