‘నన్ను ఎవరు? అని ఎవరైనా అడిగితే నేను ఏం సమాధానం చెబుతానో తెలుసా? ‘భారతీయుడు’ అని. మళ్లీ ‘మీరు ఎవరు?’ అని ప్రశ్నిస్తే.. ‘తెలుగోడిని’ అని సమాధానం చెబుతా. ఇంకోసారి ‘మీరు ఎవరు?’ అని ప్రశ్నిస్తే..‘నందమూరి తారకరామారావు కొడుకుని’ అని చెబుతాను. మరోసారి ‘మీరు ఎవరు?’ అని ప్రశ్నిస్తే.. ‘ఎన్టీఆర్ అభిమానిని’ అని చెబుతాను’ అంటూ పైసా వసూల్ ఆడియో ఫంక్షన్‌లో ఆసక్తికరంగా మాట్లాడారు బాలయ్య.
ఎన్టీఆర్ స్ఫూర్తితోనే నటుణ్ని అయ్యా. ఆయన బాటలోనే హిందూపురం శాసన సభ్యుడిగా నిలబడ్డాను. హిందూపురం కోసం నా చివరి రక్తపుబొట్టు వరకూ పాటు పడతా. పాత్ర పాత్రకీ ప్రత్యేకత ఉండేలా జాగ్రత్త పడుతున్నా. ఈ విషయంలోనూ నాన్నగారే స్ఫూర్తి. ‘పైసా వసూల్’ నా 101వ చిత్రం. ఇదే నా తొలి చిత్రం అని భావిస్తున్నా. నా పునః ప్రయాణం ఈ సినిమాతోనే మొదలవుతోంది. నాకు పాటలంటే చాలా ఇష్టం. నాన్నగారి సినిమాలోని పాటలే ఎక్కువ వింటా. తెలుగు జాతి గొప్పదనం తెలిపే పాటలూ వింటుంటాన్నారు.
శ్రియతో ఇది వరకు రెండు సినిమాలు చేశా. అవి రెండూ బాగా ఆడాయి. మూడో సినిమా ఎప్పుడు చేస్తామో’ అని బెంగపెట్టుకొంది. పూరితో మాట్లాడి వెంటనే ఈ సినిమాలో అవకాశం ఇప్పించా. ముస్కాన్ బాపుగారి బొమ్మలా ఉంది. ఈ సినిమాలో కుర్రాడిలా కనిపిస్తున్నారు అంటున్నారంతా. అది దర్శక నిర్మాతలు కల్పించిన మంచి వాతావరణం వల్లే. ఈ సినిమా కచ్చితంగా పేరుకు తగ్గట్టు భారీ వసూళ్లు సాధిస్తుంద న్నారు.