‘పద్మావత్’గా పేరు మార్చుకున్న పద్మావతి సినిమా ఎట్టకేలకు ఈ నెల 25న విడుదలకు సిద్ధమవుతుంది. కానీ అంతలోనే ఈ సినిమాకు మరో షాక్ తగిలింది. కేంద్ర సెన్సార్ బోర్డు ఈ సినిమా విడుదలకు అంగీకరించినా.. ఇందుకు తాము అంగీకరించబోమని రాజస్థాన్ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ సినిమాను నిషేధించాల్సిందేనని, తమ రాష్ట్రంలో ఈ సినిమా విడుదలకు అంగీకరించబోమని రాజస్థాన్ ప్రకటించింది.
ఇక సినిమాని పూర్తిగా నిషేదించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా కర్ణిసేన ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దేశంలోని రాజ్‌పుత్ తెగకి చెందిన వారందరు చిత్తూర్‌ఘర్ ఫోర్ట్ దగ్గర జనవరి 27న సమావేశం అయి, అక్కడ ఏం చేయాలనే దానిపై ఓ కీలక నిర్ణయం తీసుకుంటారట. పద్మావతి త్యాగం వెలకట్టలేనిది. ఆమె చరిత్రని వక్రీకరించి తీసిన సినిమాని విడుదల కానిచ్చే ప్రసక్తే లేదు.
ఈ విషయంలో చట్టాలు కూడా మమల్ని అడ్డుకోలేవు. అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని కర్ణిసేన చీఫ్ లోకేంద్ర సింగ్ కల్వి మీడియా ముందు హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీపికా పదుకొణే, రణ్‌వీర్‌సింగ్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు.