దీపికా పదుకొణే, షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం పద్మావత్. జనవరి 25న ఈ విడుదల కానున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదలైంది.
ఆందోళనలను ఖడ్గం కొనపై ఉంచుతాడే… వాడే రాజపుత్రుడు. ఇసుక నావను తీసుకుని సముద్రాన్ని సవాలు చేస్తాడే… వాడే రాజపుత్రుడు. తల తెగిపడినా మొండెం శత్రువులతో యుద్ధం చేస్తూనే ఉంటుందే వాడే రాజపుత్రుడు’’ అంటూ గాంభీర్యమైన డైలాగులతో ఈ ట్రైలర్ ఉంది. చివరిలో పద్మవత్ పాత్రదారి దీపికా పదుకునే రాజపుత్ర ఖడ్గానికి ఉన్నంత శక్తి.. రాజపుత్ర గాజులకీ ఉంటుంది అంటూ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ముగిసింది.
కొద్ది రోజులుగా పలు వివాదాల మధ్య నలుగుతున్న ఈ మూవీ అసలు విడుదల అవుతుందా, లేదా అనే అనుమానం జనాలలో ఉండగా, సుప్రీంకోర్టు తీర్పుతో రిలీజ్‌కి సిద్ధమైంది. పద్మావత్ మూవీపై రాజస్థాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్ విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. రాణి పద్మినిగా దీపిక, ఆమె భర్త రావల్ రత్ సింగ్‌గా షాహిద్ కపూర్, అల్లావుద్దీన్ ఖిల్జీ గా రణ్‌వీర్ సింగ్ నటించిన సంగతి తెలిసిందే.