టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పడి పడి లేచే మనసు’. హను రాఘవపూడి దర్శకుడు. సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 21న విడుదలకానుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం రెండు మనసుల ప్రేమ ప్రయాణానికి అందమైన దృశ్యరూపంగా ఉంటుంది. కోల్‌కతా పట్టణ నేపథ్యంలో హృద్యమైన ప్రేమకథగా దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
శర్వానంద్ పాత్ర సరికొత్త పంథాలో సాగుతుంది. మురళీశర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియారామన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు . చిత్ర రిలీజ్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ మూవీ ప్రమోషన్ జోరు పెంచారు.
తాజాగా ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘పద పద పదమని పెదవులిలా పరిగెడితే .. పరి పరి పరి విధముల మది వలదని వారిస్తే .. తరుగుతోందే మదికాయాసం .. పెదవడుగుతోందే చెలి సావాసం ..’ అంటూ ఈ సాంగ్ కొనసాగుతోంది. చుకొండల్లోని అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించిన ఈ పాట చాలా అందంగా వుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం .. శోభి కొరియోగ్రఫీ .. జేకే ఫోటోగ్రఫీ ఈ పాటకి ప్రాణం పోశాయి. ఈ పాట యూత్‌ని ఆకట్టుకునేలావుంది.