హుజురాబాద్ ప్రజలని ఇబ్బంది పెట్టొద్దు:కౌశిక్ రెడ్డి

4
- Advertisement -

హుజురాబాద్ ప్రజలని ఇబ్బంది పెట్టొద్దు అన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి.. జీవోలను ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే అని కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయనివ్వటం లేదని కోర్టులో పిటిషన్ వేస్తే.. స్థానిక శాసన సభ్యుడే పంపిణీ చేయొచ్చని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే మంత్రి పొన్నం ప్రభాకర్ నా నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ అడ్డుకున్నాడని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి ఆదేశాలతో పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారని…రేవంత్ రెడ్డి అన్న ఏ విధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నారన్నారు. సిగ్గుందా మీకు?మీరు గెలిచినట్టే మేము కూడా ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళమేనన్నారు.ఇవాళ మమల్ని ఇబ్బంది పెడుతున్నారు..రేపు మేము అధికారం లోకి వచ్చాక చూపిస్తాం..నన్ను ఇబ్బంది పెట్టండి కానీ, హుజురాబాద్ ప్రజలని ఇబ్బంది పెట్టొద్దు అని హితవు పలికారు.

Also Read:కల్కి హిట్..నారా లోకేష్ విషెస్

- Advertisement -