రివ్యూ: పడమటి సంధ్యారాగం(లండన్‌లో)

320
Padamati Sandhya Ragam London Lo Review
- Advertisement -

కొత్త నటీనటులు సైతు శాంతారామ్,షహేల రాణి జంటగా వంశీ మునిగంటి తెరకెక్కించిన చిత్రం పడమటి సంధ్యారాగం లండన్‌లో. గణేష్ క్రియేషన్స్ బ్యానర్‌ పై తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన పడమటి సంధ్యారాగం పెద్ద హిట్‌ సాధించింది..తాజాగా తెరకెక్కిన ఈ చిత్రం అభిమానులను అలరించిందా లేదా చూద్దాం..

కథ :

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఐన అరవింద్(చైతూ)కి లండన్‌లో పనిచేసే అవకాశం వస్తుంది. ఒక అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్నది అతని కల. అయితే అనుకోకుండా లండన్ వెళ్లే అవకాశం రావటంతో ఫ్రెండ్ వేణు(లండన్‌ గణేష్‌)తో కలిసి వెళ్తాడు. అలా వారు లండన్ వెళ్లిన వారికి చేదు అనుభవం ఎదురవుతుంది. ఓ గ్యాంగ్ చేతిలో మోసపోతారు. ఆ పరిస్ధితుల్లో వారిని అమూల్య(షాహేలా) ఆదుకుంటుంది. ఆ తర్వాత అరవింద్..అమూల్య ప్రేమలో పడతాడు. తర్వాత ఏం జరుగుతుంది…?అరవింద్ అమూల్యకు తన ప్రేమ గురించి చెబుతాడా..? ఈ క్రమంలోనే అతడికి ఎదురైన ఇబ్బందులేంటీ? అన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ లోకేషన్స్‌. లండన్‌లోని పలు అందమైన లొకేషన్స్‌లో కథ సాగటం థ్రిల్ గా అనిపిస్తుంది. హీరో ఆకాష్ స్పెషల్ రోల్ బాగుంది. హీరో ఫ్రెండ్‌గా నటించిన లండన్ గణేష్ అక్కడక్కడా బాగానే నవ్వించాడు. హీరో-ఆకాష్ నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ఫర్వాలేదనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ కథ,స్క్రీన్ ప్లే,నటీనటులు, దర్శకత్వం. లండన్ నేపథ్యాన్ని ఎంచుకొని, కనీసం కథనంలో కూడా కొత్తదనం చూపకపోవడంతో సినిమా అంతా బోర్‌ కొట్టిస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అంతగా వర్కవుట్ కాలేదు. హీరో చైతూ చాలా చోట్ల నటనలో తేలిపోవడం కూడా మైనస్‌గానే చెప్పుకోవాలి.

సాంకేతిక విభాగం :

సినిమాలో చెప్పుకోదగ్గ ప్రతిభ కనబరిచింది సంగీత దర్శకుడు మాత్రమే.మిగితా అంత మైనస్. ఉన్నంతలో ఆయన కాస్త ఫర్వాలేదనిపించే పాటలతో పాటు, మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆకట్టుకున్నాడు. దర్శకుడిగా, రచయితగా వంశీ ఎక్కడ ప్రతిభ చూపలేకపోయాడు.

తీర్పు :

జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన పడమటి సంధ్యారాగం అన్న సినిమాకు చాలామంది అభిమానులున్నారు. అదే ఫార్ములాతో సినిమా తెరకెక్కిన అంతగా ఆకట్టుకోలేదు. చిన్న సినిమాలకు కథే ప్రాణం అని తెలిసి కూడా, ఎలాంటి ప్రచారం లేకుండా, అసలు ఎక్కడా మెప్పించే అంశాలే లేని కథతో వచ్చిన సినిమా ‘పడమటి సంధ్యారాగం'(లండన్‌లో). మొత్తంగా లండన్ లో మూగబోయిన పడమటి సంధ్యారాగం.

విడుదల తేదీ : 06/01/2017
రేటింగ్ : 1.75/5
నటీనటులు : చైతు, షాహేలా..
సంగీతం : కేశవ్ కిరణ్
నిర్మాత : లండన్ గణేష్
దర్శకత్వం : వంశీ మునిగంటి

- Advertisement -