పీఏసీఎస్‌ల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల..

365
PACS Election
- Advertisement -

తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్) పీఏసీఎస్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుండగా.. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు నామినేషన్లను స్వీకరించనున్నారు. 9వ తేదీన నామినేషన్ల పరిశీలన. 10వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఇదే రోజు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు.

15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహణ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్‌ చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 15వ తేదీనే ఆఫీస్‌ బేరర్ల ఎన్నికను చేపట్టనున్నారు. 32 జిల్లాల్లో 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. 18 లక్షల 42 వేల 412 మంది ఓటు వేయనున్నారు.

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని దూకుడు మీదున్న అధికార టీఆర్ఎస్ సహకార సంఘాల ఎన్నికల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఆ పార్టీ నాయకత్వం వ్యూహరచన సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

PACS Election Notification

- Advertisement -