విశ్వక్ సేన్….’పాగల్’ ఫస్ట్ లుక్‌

137
pagal
- Advertisement -

నరేష్ కుప్పిలి దర్శకత్వంలో హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న చిత్రం పాగల్. మ్యాజిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌ రాజు స‌మ‌ర్పణ‌లో లక్కీ మీడియా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై బెక్కం వేణు గోపాల్ నిర్మిస్తున్నారు.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇవాళ పాగల్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ ఫ‌స్ట్‌ లుక్ పోస్టర్‌తో పాటు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల‌చేస్తున్నట్లు అధికారికంగా ప్రక‌టించారు. ఈ పోస్టర్‌లో విశ్వక్‌సేన్ ఉబర్ కూల్ లుక్‌లో క‌నిపిస్తున్నారు.

ర‌ధ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి ఎస్.మణికంద‌న్‌ సినిమాటోగ్రఫీ, గ్యారీ బీహెచ్‌ ఎడిటింగ్ అందిస్తున్నారు. విజయ్ ప్రకాష్ కొరియోగ్రాఫర్. లత తరుణ్ ప్రొడక్షన్ డిజైనర్, వెంకట్ మద్దిరాల చీఫ్ కో డైరెక్టర్, అనిల్ భాను పబ్లిసిటీ డిజైనర్.

- Advertisement -