టీఆర్ఎస్‌లో చేరిన కౌశిక్ రెడ్డి..

181
koushik
- Advertisement -

హుజురాబాద్ నియోజకవర్గ నేత, టీపీసీసీ మాజీ కార్య‌ద‌ర్శి పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు కౌశిక్ రెడ్డి. ఆయనతో పాటు వందలాది మంది కాంగ్రెస్ నేతలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

2018లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కౌశిక్‌…ఈటలకు గట్టిపోటీనిచ్చారు. ఎన్నికల తర్వాత కూడా నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ కార్యకర్తలను కాపాడుకున్నారు. ఈ క్రమంలో కౌశిక్ టీఆర్ఎస్‌లో చేరడం కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ అనే చెప్పాలి.

- Advertisement -