ఎస్సీ,ఎస్టీ కేసుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు..

486
p ramulu
- Advertisement -

సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి ప్రతి అధికారి పనిచేయాలని…..ఎస్సీ,ఎస్టీ కేసుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కమిషన్ తరుపున చర్యలు తీసుకుంటామని చెప్పారు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కె రాములు తెలిపారు. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎస్టీలపై జరిగే దాడులలో తెలంగాణ రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉందన్నారు.

కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో ఎస్సీలపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తూతూ మంత్రంగా ఎస్పీని, కింది స్థాయి అధికారులను మాత్రమే బదిలీ చేశారని చెప్పారు. రాష్ట్రంలో 335అట్రాసిటీ,216 నుండి 218 రేప్ కేసులు,18లా అండ్ ఆర్డర్ కేసులు నమోదైనా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.

అసైన్డ్ భూములను ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీలకే కేటాయించాలి. అభివృద్ధి పేరు చెప్పి ప్రభుత్వం కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లాలో ఎస్సీ,ఎస్టీల భూములు, అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకొని వేరే వర్గాలకు కేటాయిస్తుందన్నారు. రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీ ల రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావడం లేదన్నారు.

దళిత బడుగు బలహీన వర్గాల కోసం కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టె పథకాలు రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. ఆవాస్ యోజన,ఆయుష్మాన్ భవ లాంటి కేంద్ర పథకాలు బలహీన వర్గాలకు లాభం చేకూరుస్తాయి…వాటిని అమలు చేయాలన్నారు.

- Advertisement -