గోపీచంద్ హీరోగా.. రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఆక్సిజన్’. ఎ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకువచ్చింది. గోపీచంద్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..?గోపిచంద్‌కు ఈ మూవీ నిజంగా ఆక్సిజన్ ఇచ్చిందా లేదా చూద్దాం…
కథ :
రఘుపతి(జగపతి బాబు) రాజమండ్రిలో ఊరిపెద్ద. ఈ కుటుంబానికి వీరభద్రం(సాయాజిషిండే) నుంచి ముప్పు ఉంటుంది. కూతురికి ప్రాణాపాయం ఉందని చెప్పి ఇల్లు దాటనివ్వడు. ఈ క్రమంలో శృతి(రాశి ఖన్నా)కి విదేశీ సంబంధం చూసి పెళ్లి చేస్తే బాగుంటుందని చూస్తాడు. అలా కృష్ణప్రసాద్(గోపీచంద్) శృతిని చూడటానికి అమెరికా నుంచి రాజమండ్రి వస్తాడు. కానీ వారికి కృష్ణప్రసాదే అసలు శత్రువు అని తెలిసి షాకవుతారు. ఆర్మీ ఆఫీసర్ గా ఉన్న సంజీవ్ ఎందుకు ఆ ఫ్యామిలీకి శత్రువుగా మారాడు..? అసలు ఎందుకు ఆర్మీ నుంచి ఇక్కడికి వచ్చాడు అనేది అసలు కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ గోపిచంద్, స్క్రీన్ ప్లే. గోపిచంద్ తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు.ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రల్లో ఇది కాస్త కొత్తగా ఉంటుంది. దేశం కోసం ప్రాణాలిచ్చే సైనికుడిగా ఆకట్టుకున్నాడు. ఇక రాశీఖన్నా,అను ఎమ్మాన్యుయెల్ క్యూట్ లక్స్ తో ఆకట్టుకున్నారు.జగపతిబాబు మరోసారి విలన్ గా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. మిగితా పాత్రల్లో వెన్నెల కిషోర్, ఆశిష్ విద్యార్థి తమ పరిధిమేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రొటీన్ రివెంజ్ స్టోరీ లో ఊహకు అందని విషయాలు పొందుపరుస్తు ప్రేక్షకులను మెప్పించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
మైనస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ రొటీన్ కథ,సెకండాఫ్. హీరో కుటుంబాన్ని విలన్లు భయపెట్టడం.. హీరో వాళ్లకు అడ్డుగా నిలబడటం ఇవన్నీ చాలా సినిమాల్లో కనిపించే సీన్స్. తొలి భాగం ఒక సినిమా చూస్తున్నట్లు సెకండాఫ్ మరో సినిమా చూస్తున్నట్లు అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. యువన్ శంకర్ రాజా సంగీతం హైలైట్ అని చెప్పుకోవాలి. ఛోటా కె . నాయుడు ఫోటోగ్రఫీ తో పాటు ఏ. ఏం. రత్నం స్క్రీన్ ప్లే సినిమాకు అదనపు బలం తెచ్చిపెట్టాయి. జ్యోతికృష్ణ కథ ఎంత రొటీన్‌గా అనిపించిందో ఏ .ఎం . రత్నం స్క్రీన్ ప్లే అంత కొత్తగా ఉంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ధూమపానం కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ఆక్సిజన్. గోపిచంద్ నటన,స్క్రీన్ ప్లే సినిమాకు ప్లస్ కాగా రోటిన్ కథ సినిమాకు మైనస్ పాయింట్స్. కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్ ఆక్సిజన్‌తో సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లే.
విడుదల తేదీ:30/11/2017
రేటింగ్: 2.5 /5
నటీనటులు : గోపీచంద్ , అను ఇమ్మనుఎల్, రాశి ఖన్నా
సంగీతం : యువన్ శంకర్ రాజా
నిర్మాతలు: ఏఎమ్ రత్నం , ఐశ్వర్య
దర్శకత్వం : జ్యోతికృష్ణ