సూర్యపేట పురాపాలక సంఘం పరిధిలోని రెండో వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన వర్డులో పర్యటన చేసి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,మున్సిపల్ చైర్మన్, అన్నపూర్ణమ్మ, వైస్ ఛైర్మన్ కిషోర్, గ్రంధాలయ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్,జెడ్పీ వైస్ ఛైర్మన్ వెంకట నారాయణ,తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆక్సిజనే అసలైన ఆస్తి.. భవిష్యత్ తరాలకు అందించాల్సింది ఆక్సిజనే.. అది అందించే కార్యక్రమం మన ఇంటి నుండే మొదలు పెట్టాలి.. యావత్ ప్రపంచాన్ని పర్యావరణం కాలుష్యం బెంబేలెత్తిస్తుంది. మానవాళి మనుగడనే పర్యావరణం కాలుష్యం ప్రశ్నార్ధకంగా మార్చిందన్నారు.
అకాల జబ్బులకు పర్యావరణ సమస్యే కారణం. ఇదే పరిస్థితి ఇలా కొనసాగితే భవిష్యత్‌లో అక్షిజన్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అది అధిగమించడం మన చేతుల్లోనే ఉంది. చెట్లు పెంచడమే అందుకు పరిష్కారమని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మహాత్తర కార్యక్రమం హరితహారం అందులో భాగమే. అడవుల పెంపకం తోటే మానవాళిని కాపాడొచ్చు అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని మంత్రి అన్నారు.
పట్టణ ప్రగతిలో పర్యవరణ సమస్యకు చెక్ పెట్టేలా చెట్లను పెంచాలి.పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు వెల్లువలా వచ్చి పాల్గొంటున్నారు.ఇందుకు ఏర్పాటు అయిన కమిటీలు చాలా ఉత్సాహంగా పని చేస్తున్నాయి. పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాలు అందంగా, ముస్తాబు అవుతాయి. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా, విధిగా ఇండ్లు కట్టుకునేవారు చెట్లు పెంచేలా చర్యలు తీసుకోవాలి. పట్టణ ప్రగతిలో మొదట ప్రాధన్యుత పర్యావరణం అని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రెండవ ప్రాధాన్యుత అంశం పారిశుధ్యం. మూడవ ప్రాధాన్యత అంశంగా శ్మశాన వాటికలనిర్వహణ. ప్రజలు పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులు మాటను నిలబెట్టుకోవాలి.మరుగుదొడ్లు సంపూర్ణం కావాలి. ఇంకుడు గుంటలను అందరూ నిర్మాణం చేసుకునేలా అవగాహన చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి వివరించారు. కాగా 2 వర్డులోని స్మశాన వాటిక నిర్మాణానికి 20 లక్షల మంజూరు చేసిన మంత్రి జగదీష్ రెడ్డి. వార్డులో సీసీ రోడ్ల నిర్మాణంకి పూజ చేశారు.