ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభించిన సీపీ మహేష్ భగవత్..

185
CP Rachakonda
- Advertisement -

రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్, డీఆర్డీవో, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆక్సిజన్ బ్యాంక్‌ను శనివారం రాచకొండ సీపీ మహేష్ భగవత్ ప్రారంభించారు. అలాగే ఈ కార్యక్రమంలో ఫ్లాస్మా డొనేషన్‌కు సంబంధించిన వెబ్ సైట్, షార్ట్ ఫిలింను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. కరోనా రెండో దశలో చాలా మంది‌ ఇబ్బందులు పడుతున్నారు. ఆక్సిజన్ కొరత నేపథ్యంలో హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులకు సహాయం చేసేందుకు ఇది ప్రారంభించాము. ఎవరికైనా ఆక్సిజన్ అవసరమైన సమయంలో రాచకొండ కమీషనరేట్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేయండి అని సూచించారు.

ఆక్సిజన్ అవసరమైనవారు 9490617234 కి కాల్ చేయండి. ఆక్సిజన్ అవసరం ఉన్నవాళ్లు డాక్టర్ ప్రిస్కిప్షన్ ఆధార్ కార్డు, పాజిటీవ్ రిపోర్ట్ చూపించాలి.అవసరం ఉన్నవారికి ఆక్సిజన్ అందిస్తామని అన్నారు. కొవిడ్ చాలా వేగంగా విస్తరిస్తోంది. కోవిడ్ నుంచి కోలుకున్నవారు ఫ్లాస్మా డొనేషన్ చేయాలి. రక్తదానం చేయాలంటే మూడు నెలల సమయం కావాలి.. కానీ ప్లాస్మా డొనేషన్ పదిహేను రోజులకు చేయవచ్చు.ఒక్కొక్కరు 400 ml వరకు ఫ్లాస్మాదానం చేయవచ్చు.సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఓ వ్యక్తి 21 సార్లు ఫ్లాస్మా డొనేట్ చేశారు.

మా వెబ్ సైట్‌లో ఫ్లాస్మా డొనేషన్ కోసం ఒక‌ లింక్ కూడా ఏర్పాటు చేశాము.ఏ బ్లడ్ గ్రూప్ వారైనా సంప్రదించవచ్చు.ప్రతి ఒక్కరు ఫ్లాస్మా డొనేషన్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.కోలుకున్న ప్రతీ ఒక్కరు పదిహేను రోజుల తర్వాత ఫ్లాస్మా డొనేట్ చేయవచ్చు.మహిళా పోలీసులు కూడా ఫ్లాస్మా డొనేట్ చేస్తున్నారు.నేను కూడా ఫ్లాస్మా డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. యువత ఫ్లాస్మా డొనేట్ చేయడానికి ముందుకు రావాలి.ఫ్లాస్మా డొనేషన్ వల్ల ఎలాంటి‌ సైడ్ ఎఫెక్ట్స్ రావు అని సీపీ మహేష్ భగవత్ తెలిపారు.

- Advertisement -