- Advertisement -
రాష్ట్రపతి విన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా సోమవారం కేంద్ర మాజీ యశ్వంత్ సిన్హా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. సిన్హా నామినేషన్ వేసిన రోజుననే ఆయనకు మద్దతు ప్రకటిస్తూ ఏఐఎంఐఎం ఛీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓ కీలక ప్రకటన చేశారు. మజ్లిస్ పార్టీ ప్రజా ప్రతినిధులు రాష్ట్రపతి ఉన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హాకే ఓటు వేస్తారని సదరు ప్రకటనలో అసదుద్దీన్ ప్రకటించారు.
ఈ విషయంపై ఇప్పటికే యశ్వంత్ సిన్హా తనకు ఫోన్ చేశారని, ఆ సందర్భంగానే ఆయనకు మద్దతు ప్రకటించానని ఓవైసీ పేర్కొన్నారు. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాకు పలు పార్టీలు మద్దతునిచ్చాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్ పార్టీ కూడా యశ్వంత్ సిన్హా కే మద్దతు పలికిన విషయం తెలిసిందే.
- Advertisement -