- Advertisement -
‘బఫూన్ బెదిరింపులు’ అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ నుంచి తమ దేశానికి వచ్చే దిగుమతులపై అదనంగా మరో 25 శాతం సుంకాలు విధించడంపై ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రంప్ చేష్టలు అత్యున్నత స్థాయిలో ఉన్న బఫూన్ బెదిరింపుల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. భారత ఎగుమతులపై ట్రంప్ ఇప్పటికే 25 శాతం సుంకాలను అమలు చేస్తున్నారని, ఇప్పుడు అదనంగా మరో 25 శాతం సుంకాలు విధించడంతో మొత్తం టారిఫ్స్ 50 శాతానికి చేరాయని తెలిపారు అసద్.
Also Read:నిరుద్యోగ హామీలు.. BRSV ప్రత్యేక గూగుల్ స్కానర్
ట్రంప్ ఇంత భారీగా సుంకాలు విధిస్తున్నప్పటికీ, ప్రభుత్వంగానీ, ప్రధాని నరేంద్రమోదీ గానీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు.
- Advertisement -

