బీహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలో AIMIM (ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్) అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక ప్రకటన చేశారు.బీహార్ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకున్న 5 ఎమ్మెల్యే స్థానాలను తిరిగి నిలబెట్టుకుంది మజ్లిస్ పార్టీ.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన NDA (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఒవైసీ ప్రకటించారు.అయితే, ఈ మద్దతుకు ఆయన ఒక షరతు విధించారు. బీహార్‌లో తాము గెలిచిన స్థానాలు ఉన్న సీమాంచల్ ప్రాంతానికి కొత్త ప్రభుత్వం న్యాయం చేస్తేనే ఈ మద్దతు ఉంటుందని ఒవైసీ స్పష్టం చేశారు.
సీమాంచల్ ప్రాంతంలో అభివృద్ధి, విద్య, ఉపాధి వంటి అంశాలపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని NDA కూటమికి మజ్లిస్ మద్దతు ఇవ్వడం బీహార్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన మలుపుగా మారింది.
రెండు దశల్లో జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించి 202 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ కూడా 2020 ఎన్నికల కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ 85 సీట్లు గెలుచుకుంది. ఎల్‌జేపీ-ఆర్‌వీ 19, హెచ్‌ఏఎం(ఎస్) 5, ఆర్‌ఎల్‌ఎం 4 సీట్లు సాధించాయి. మహాఘట్‌బంధన్ 35 స్థానాలకే పరిమితమైంది.
Also Read:USA:డోజ్ విభాగం మూసివేత

