ఓవర్ వ్యూ ఆఫ్ హైదరాబాద్ మెట్రో..

485
hyderabad metro
- Advertisement -

సంక్రాంతికి జేబీఎస్‌- ఎంజీబీఎస్‌కు మెట్రో పరుగులు పెట్టనుందని తెలిపారు మెట్రో రైలు జీఎం ఏడుకొండలు. ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇంజనీర్స్‌లో డాక్టర్ ఏ రామకృష్ణ స్మారకోపన్యాసం చేయగా ఈ సందర్భంగా ఓవర్ వ్యూ ఆఫ్‌ హైదరాబాద్‌ ప్రాజెక్టు కన్‌స్ట్రక్షన్‌ అంశంపై మాట్లాడారు. ప్రపంచంలోనే మెట్రో రైలు ప్రాజెక్టులన్నింటిలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అత్యుత్తమైనదిగా అభివర్ణించారు. ఎల్ అండ్ టీ సంస్థ కాకుండా మరే ఇతర సంస్థ ఇంత పెద్ద ప్రాజెక్టును చేపట్టలేదని చెప్పుకొచ్చారు.

జూబ్లి బస్ స్టేషన్ – ఎంజీబీఎస్ మార్గంలో ట్రయల్ రన్ జరుగుతోందని..నిబంధనల ప్రకారం 45 రోజులు దీనిని నిర్వహించాల్సి ఉంటుందన్నారు. హైటెక్ సిటీకి మెట్రో రామకృష్ణ ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనమని, దాని చుట్టూ నెక్లెస్‌లా నిర్మించిన మెట్రో రైలు నిర్మాణం కూడా ఆయన ఆలోచనలకు ప్రతిరూపం అని కొనియాడారు.

()పబ్లిక్‌ అండ్‌ ప్రైవేట్‌ పార్టిసిపేషన్‌ పద్ధతిలో నిర్మించిన మెట్రో రైల్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా రికార్డు సాధించింది.
()గత రెండు సంవత్సరాల్లో 12 కోట్ల 5లక్షల మంది మెట్రోలో ప్రయాణించారు.
() రెండు సంవత్సరాల కాలంలో 4లక్షలకు పైన ట్రిప్పులతో 86 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన ఘనత మెట్రోకే దక్కుతుంది
() ట్రాఫిక్‌కి చెక్‌‌ పెడుతూ,సౌండ్ పొల్యూషన్‌కి దూరంగా,స్మార్ట్‌‌, ఎకో ఫ్రెండ్లీ విధానంతో హైదరాబాద్ మెట్రో దూసుకుపోతోంది
()కారిడార్ – 2 నిర్మాణ పనులన్నీ పూర్తి కావడంతో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న 10 కిలోమీటర్ల మార్గాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు
()జూబ్లీ బస్‌స్టేషన్‌, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, వ్యాపార కేంద్రం సుల్తాన్‌ బజార్‌, ఎంజీబీఎస్‌కు మెట్రో సదుపాయం

- Advertisement -