యుఎస్‌లో కరోనా బీభత్సం..

176
coronavirus
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికాను కరోనా వదలడం లేదు. ఇప్పటికే కరోనా కేసుల్లో అమెరికా అగ్రస్ధానంలో ఉండగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా శరవేగంగా సాగుతోంది. అయితే ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్న మరోవైపు కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గడం లేదు.

గురువారం ఒక్కరోజే అమెరికాలో 1,26,125 కరోనా కేసులు నమోదుకాగా, 3572 మంది మృతిచెందారు. గత రెండు వారాల్లో అమెరికాలో 50 వేల మంది కరోనాతో మృతి చెందారంటే పరిస్ధితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పటివరకు అమెరికాలో 26,804,927 కరోనా కేసులు నమోదుకాగా 4,59,278 మంది మృతి చెందారు. జూన్ 1 వరకు మృతుల సంఖ్య 6 లక్షల 30 వేలు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.మరోవైపు అధ్యక్షుడు జో బైడెన్ 100 రోజుల తప్పనిసరి మాస్క్ పాలసీని తీసుకొచ్చింది. ఇది ఎంతవరకు సత్ఫలితాలనిస్తాయో వేచిచూడాలి.

- Advertisement -