- Advertisement -
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఎముకలు కొరికే చలిలో అన్నదాతలు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళన నేపథ్యంలో స్పందించిన సుప్రీం…కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను సస్పెండ్ చేసింది.
ఇక రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ హర్యానా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రైతులను ఆందోళనలను పట్టించుకోని భారతీయ జనతా పార్టీ, జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) నాయకులపై రైతులు కన్నెర్ర చేస్తున్నారు.
ఈ రెండు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను గ్రామాల్లోకి రానివ్వొద్దని 60 గ్రామాల ప్రజలు, రైతులు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ – జేజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ఆ రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు.
- Advertisement -