‘లైగ‌ర్’ పోస్ట‌ర్‌ రిలీజ్‌.. ఫ్యాన్స్‌ బీరాభిషేకాలు..

148
Liger's first look
- Advertisement -

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. విజయ్‌ చేసింది కొన్నే సినిమాలే అయిన‌ప్ప‌టికీ స్టార్ హీరో రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ రౌడీ హీరో ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్‌తో క‌లిసి లైగ‌ర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ సోమవారం విడుద‌ల చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో లైగర్ రచ్చ మొదలయింది. విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్‌ను అభిమానులు పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినిమా విడుదలయిందా.. అన్నట్లుగా సందడి చేస్తున్నారు. పచ్చబొట్లు, బీరాభిషేకాలు, కేక్ కటింగ్‌లు, బాణాసంచా, స్వీట్లతో పంచుతూ ఫ్యాన్స్‌ రచ్చ చేస్తున్నారు.

ఇక పూరి కనెక్ట్స్‌తో కలిసి, బాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఒక యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. విజయ్‌దేవ‌ర‌కొండ స‌ర‌స‌న బాలీవుడ్ హీరోయిన్ అన‌న్యా పాండే న‌టిస్తోంది. ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌లో విజ‌య్‌దేవ‌ర‌కొండ పొడవాటి జుట్టు, చేతికి గ్లౌవ్స్‌తో మార్ష‌ల్ ఆర్టిస్ట్‌లా క‌నిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో సింహం మరియు పులి యొక్క మిశ్రమ రూపం ఉంది. లైగ‌ర్ టైటిల్ డిఫ‌రెంట్‌గా ఉండ‌డంతోపాటు ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ అందిరి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.

- Advertisement -