మా ఓట్లు కారు గుర్తుకే.. మీర్‌పేట ప్రజల ఏకగ్రీవ తీర్మానం..

23
minister errabelli

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా మీర్ పేట హౌసింగ్ బోర్డు డివిజన్ ముఖ్య కార్యకర్తలు, నాయకులు, బూత్ ఇంచార్జీ లతో భారత్ ఫంక్షన్ హాల్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఈ ఎన్నికల వ్యూహ, ప్రతి వ్యూహాలను పార్టీ శ్రేణులకు వివరించారు. పార్టీ డివిజన్ అభ్యర్థి ప్రభుదాస్, డివిజన్ పార్టీ సీనియర్ నేతలు శ్రీనివాస్ రెడ్డి, అంజయ్య, పార్టీ వివిధ విభాగాల నేతలతో కలిసి చర్చించారు మంత్రి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని..ప్రత్యర్థి పార్టీల బలాబలాల అంచనాతో ముందుకు సాగాలని సూచించారు.

ఈ సందర్భంగా..జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుగా మీర్ పేట హౌసింగ్ బోర్డు డివిజన్‌లోని లక్ష్మి నగర్, శ్రీనివాస్ నగర్ కాలనీల ప్రజల ఏకగ్రీవ తీర్మానం చేశారు. మా ఓట్లు కారు గుర్తుకే నంటూ…మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో తీర్మానించిన డైమండ్స్ కాలనీ మైనారిటీ లు తెలిపారు. ఈ సమావేశంలో మేస్త్రి సంఘం తరపున మేస్త్రిలు, కూలీలు టీఆర్ఎస్‌లో చేరారు. అలాగే బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీల నుండి మీర్‌ పేట డివిజన్ ముఖ్య నేతలు, కార్యకర్తలు, యువకులు, మహిళలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. వారందరికి మంత్రి టీఆర్‌స్‌ కడువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.