బిగ్ బాస్ 4…78 ఎపిసోడ్ హైలైట్స్

48
avinash

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 78 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 78వ ఎపిసోడ్‌లో భాగంగా సండ్ ఫన్ డే సరదాగా సాగగా ఇంటి నుండి ఎవరు ఊహించని విధంగా లాస్య ఎలిమినేట్ అయ్యారు.

తొలుత సండే ఫన్ డేలో భాగంగా బిగ్ బాస్ టీవీలో ఇచ్చే కొన్ని గుర్తుల, బొమ్మలు ఆధారంగా అది ఏ పాటో గుర్తుపట్టాలని టాస్క్ ఇచ్చారు నాగార్జున. దీని కోసం ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా విడగొట్టారు. హారిక కెప్టెన్‌గా ఒక టీమ్, అరియానా కెప్టెన్‌గా మరో టీమ్‌గా విడదీశారు. హారిక టీమ్‌లో లాస్య, అభిజీత్, అఖిల్ ఉండగా అరియానా టీమ్‌లో అవినాష్, సోహెల్, మోనాల్ ఉన్నారు. మొత్తంగా పాటల పోటీ ఆధ్యంతం ఆసక్తిగా సాగింది.

గాజువాక పిల్ల మేం గాజులోలం కాదా అనే పాటకు అరియానా, సోహెల్ డ్యాన్స్ చేశారు. ఇక ఇదే పాటకు అవినాష్….మోనాల్ చేతిలో చేయ్యేసి డ్యాన్స్ చేయడం విశేషం. తెలుగు బాగా వచ్చు కదా అవినాష్. పాణి గ్రహణం అంటే ఏంటి? అని అడిగారు నాగార్జున. దీనికి అవినాష్ సమాధానం చెప్తూ.. వాటర్‌తో వచ్చే గండాన్ని పాణి గ్రహణం అంటారు అని చెప్పాడు. అయితే వెంటనే లాస్య ….పెళ్లిలో దంపతులతో చేయిస్తారు. ఒకరి చేయిని మరొకరి చేతిలో పెట్టడాన్ని పాణి గ్రహణం అంటారు అని తెలిపింది. దీంతో అవినాష్‌పై పంచ్‌ విసిరారు నాగ్. ఈ గేమ్‌లో హారిక టీమ్ విజయం సాధించింది.

పాటల గేమ్ తరవాత లూడో గేమ్ ఆడించారు నాగార్జున. ఇక్కడ కూడా హారిక, అరియానా టీమ్‌ల మధ్య ఈ పోటీ జరిగింది. ఈ గేమ్‌లో అరియానా టీమ్ విజయం సాధించింది. ఇక చివరగా ఎలిమినేషన్‌లో హారిక-లాస్య ఇద్దరు మిగలగా కాసేపు టెన్షన్ అనంతరం లాస్య ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు నాగ్.ఇక ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత హారిక,అభిజిత్‌ల గురించి ఇంటి సభ్యులందరికంటే పాజిటివ్‌గా తెలిపి వారికి మరింత ప్లస్ చేసింది లాస్య.