రంజాన్ కానుకలు పంపిణీ చేసిన మంత్రి అల్లోల..

18
minister ik reddy

రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అందజేసే గిఫ్ట్ ప్యాక్ లను ఆదివారం నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్న సంకల్పంతో అన్ని మతాలను గౌరవిస్తూ ప్రతి పండగకి గిఫ్ట్ ప్యాక్ లను పంపిణీ చేస్తున్నారని అన్నారు. బతుకమ్మ పండుగకి ఆడబిడ్డలకు సారెలు పంపిణీ చేస్తున్నట్లు రంజాన్ క్రిస్మస్ పండుగలకు దుస్తులు అందిస్తున్నట్లు తెలిపారు.అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.