- Advertisement -
జీ7 సమ్మిట్‌లో భాగంగా జపాన్ పర్యటనకు వెళ్ళిన మోదీ అక్కడి భారత జాతిపిత మహాత్మ గాంధీ విగ్రహంను ఆవిష్కరించారు. ప్రపంచానికి శాంతి సహనం సత్యం ఆహింస మార్గాలను సూచించిన విశ్వశాంతి స్థాపకుడికి ఘనమైన నివాళుల్పరించారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..జపాన్ ప్రధానికి ఇచ్చిన బోధివృక్షంను హిరోషిమాలో నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. జపాన్ ప్రధాని కిషిద ఆహ్వానం మేరకు జీ7 సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం జపాన్‌కు బయలుదేరిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు మే 19 నుంచి 21వరకు హిరోషిమాలో జరగనుంది.
ఆగస్టు 6,1945లో హిరోషిమా, నాగాసాకిలపై అమెరికా అణుబాంబులతో విరుచుకుపడింది. ఈ దాడిలో సుమారుగా 140000,75వేల మంది మరణించారు. కాగా హిరోషిమాలో జీ7 సమ్మిట్ జరగనుంది.
Also Read: KARNATAKA:నేడే కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం
- Advertisement -