ఓయూ…వందేళ్ల పండుగ షురూ

196
OU centenary celebrations started
- Advertisement -

ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.  మూడు రోజుల పాటు జరిగే  వేడుకలను  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జ్యోతి ప్రజ్వాళన చేసి ప్రారంభించారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.  జాతీయ గీతం పాడిన తర్వాత  ఓయూ వీసీ రామచంద్రం వెల్ కమ్ స్పీచ్ ఇచ్చారు. ఉస్మానియా వందేళ్ల ఉత్సవానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఓయూ వందేళ్ల వేడుక పైలాన్‌ ను ప్రణబ్ ఆవిష్కరించారు.

సంబురాలకు వచ్చేవాళ్లక ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు చేపట్టారు. వీఐపీలు, విద్యార్ధులు ఇలా మొత్తం 12 గేట్ల నుంచి.. మీటింగ్ హాల్ కు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో మొదటి రోజు 16 వేల మంది వరకు పాల్గొననున్నారు. ఐడీ, ఎంట్రీ పాస్ లేకుండా లోనికి రానివ్వబోమని ఓయూ వీసీ స్పష్టం చేశారు.

OU centenary fest gets finishing touches

18 వేల మంది కూర్చునేటట్లు  ప్రాంగణాన్ని ఏసీలతో ఏర్పాట్లు చేశారు.  మంచినీళ్లు, టాయిలెట్స్, ఫైర్ ఇంజిన్లు, డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. జీహెచ్ ఎంసీ, పోలీస్, రహదారులు భవనాలశాఖ, వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ, సమాచార, పౌరసంబంధాలశాఖ, సాంస్కృతికశాఖ, అగ్నిమాపకశాఖ, ప్రొటోకాల్ విభాగం  వాళ్లు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. NSS వాలంటీర్లు వేదిక దగ్గర స్వచ్ఛభారత్ చేపట్టారు.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.  సాయంత్రం నాలుగు గంటలకు గచ్చిబౌలిలో గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ప్రోగ్రామ్ లో పాల్గొంటారు ప్రణబ్.  ఇక్కడి నుంచి బేగం పేట ఎయిర్ పోర్టుకు వెళ్లి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు.ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్లే ఆర్టీసి బస్సులను మళ్లిస్తుండడంతో వాహనదారులు, ప్రయాణీకులు తమ గమ్యస్థానాలను సులువుగా చేరుకునేందుకు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని పోలీస్‌ అధికారులు సూచించారు.

- Advertisement -