ప్రణబ్‌కు ఘనస్వాగతం..

190
CM KCR Receive President Pranab
- Advertisement -

ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హైదరాబాద్‌లో ఘనస్వాగతం లభించింది. గోవా నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, శాసనసభ సభాపతి మధుసూదనాచారి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రణబ్‌ ముఖర్జీకి పాదాభివందనం చేసి, పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఏడాదిపాటు నిర్వహించే ఉస్మానియా శతాబ్ది వేడుకలను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రారంభించనున్నారు. క్రీడా సముదాయం, వసతి గృహాలు, శతాబ్ది భవనం, పైలాన్‌ నిర్మాణాలకు శంకుస్థానప చేసి కీలకోపన్యాసం చేయనున్నారు.

- Advertisement -