వందేండ్ల పండగకు ఉస్మానియా యూనివర్సిటీ ముస్తామైంది. రేపటి(బుధవారం) మూడు రోజుల పాటు అట్టహాసంగా ఓయూ వందేళ్ల పండగ జరగనుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ పండుగలో ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టారు పోలీసులు. ముఖ్యంగా రాష్ట్రపతి నగరానికి వస్తుండటంతో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు పోలీసులు.
శతాబ్ది ఉత్సవాలు సక్సెస్ గా జరిగేందుకు అందరి సహకారంతో ముందుకు వెళుతున్నారు. మొత్తం 24 గ్యాలరీల్లో 16వేల మంది ఉండేలా ఏర్పాట్లుచేశారు. బుధవారం జరగబోయే కార్యక్రమంలో మొదట వర్సిటీ చరిత్రను తెలిపే పైలాన్‌కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కేవలం వందేళ్ల గుర్తుగానే కాకుండా రాతిపై ఓయూ చరిత్ర మొత్తం తెలిపేలా దీన్ని ఏర్పాటు చేయనుండటం విశేషం! నిర్మాణ స్థలానికి వెళ్లకుండా రాష్ట్రపతి దీనిని ఎల్‌ఈడీ తెరపై ఆవిష్కరించనున్నారు. దీంతోపాటు పరిపాలన భవనానికికూడా శంకుస్థాపన చేయనున్నారు.
వీసీ ప్రొఫెసర్ ఎస్.రామచంద్రం స్వాగతోపన్యాసం ఇవ్వనున్నారు. అనంతరం రాష్ట్రపతి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభిస్తారు. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు సభనుద్దేశించి మొదట మాట్లాడనున్నారు. ఆ తరవాత డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, తరువాత కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.58 గంటలకు సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. ఆపై ఓయూ కీర్తిని తెలిపే మూడు పుస్తకాలను గవర్నర్ నరసింహన్ ఆవిష్కరిస్తారు. ఇంగ్లి్‌షలో ‘రిఫ్లెక్షన్స్’, ఉర్దూలో ‘సౌగత’, తెలుగులో ‘వందేళ్ల ఉస్మానియా’ పేరుతో విడుదల చేయనున్నారు.
ఉస్మా నియా శతాబ్ది ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రూ. 200 కోట్లు కేటాయించింది. ఎండలను దృష్టిలో ఉంచుకుని సౌకర్యంగా కుర్చోనే ఏర్పాట్లు, మంచినీళ్లు, భోజనాల వసతి, మెడికల్ సౌకర్యం, మొబైల్ మరుగుదొడ్లు ఉంచినట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ‘వందేళ్లు – వంద గళాలు’ కార్యక్రమంలో వందమంది గాయకులు పాల్గొననున్నారు.
మూడు రోజుల కార్యక్రమాల వివరాలు..
ఏప్రిల్ 26
వేదిక : ఏ గ్రౌండ్స్
ఉ.10:30 సాంస్కృతిక కార్యక్రమాలు
మ.12:00 ఓయూ డాక్యుమెంటరీ పదర్శన
మ.12.30-01.30 రాష్ట్రపతి చేతుల మీదుగా వేడుకలు ప్రారంభం
ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కె.కేశవరావు, నగర మేయర్ బొంతురామ్మోహన్ హాజరుకానున్నారు
మ.03:00, వేదిక : ఠాగూర్ ఆడిటోరియం
‘రోల్ ఆఫ్ ఓయూ ఇన్ తెలంగాణ అండ్ నేషనల్ బిల్డ్‌ంగ్’ సెమినార్
మాజీ వీసీ ప్రొ.మమ్మద్ సులేమాన్ సిద్దిఖి, మాజి ఎమ్మెల్సీ ప్రొ.కె.నాగేశ్వర్, ఐఐసీటీ డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్, మాజి వీసీ ప్రొ.టి.తిరుపతిరావు, మాజి విజిలెన్స్ కమిషనర్ రంజనకుమార్, రాష్ట్ర గురుకుల విద్య కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, బ్యాట్మంటన్ కోచ్ ఎస్‌ఎం ఆరిఫ్ ప్రసంగిస్తారు.
ఏప్రిల్ 27
ఉ.10:00
వేదిక : ఠాగూర్ ఆడిటోరియం
నోబుల్ గ్రహీత తునేషియా దేశానికి చెందిన అబ్‌దెసత్తర్ బెన్ మౌసా ప్రసంగం
ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర
ఉ.11.45
ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ ప్రసంగం
మ.03:00
వేదిక : ఏ గ్రౌండ్స్
పూర్వవిద్యార్థుల సమావేశం
ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
సా.04.00
వేదిక : ఠాగూర్ ఆడిటోరియం
ఆల్ ఇండియా వైస్‌ఛాన్సరల్స్ కాన్షరెన్స్
ముఖ్య అతిథి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌జవదేకర్
ఏప్రిల్ 28
ఉ.09.00
వేదిక: ఐఐసీటీ ఆడిటోరియం
ఆల్ ఇండియా వైస్‌ఛాన్సరల్స్ కాన్షరెన్స్ రెండో రోజు కొనసాగింపు
ముఖ్యఅతిథిగా డిప్యూటి సీఎం కడియం శ్రీహరి
ఉ.10:00
వేదిక : రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విర్వామెంట్ స్టడీస్
ఓయూ విజన్ – ఏ ప్యానల్ చర్చ (భవిష్యత్తు 50 ఏళ్లలో ఓయూ ఎలా ఉండాలి అనేదానిపై చర్చ)
ముఖ్యఅతిథులు ఎంపీ కే కేశవరావు, డీఆర్‌డీవో సైంటఫిక్ అడ్వజైరీ జి.సతీష్‌రెడ్డి.
ఓయూ శతాబ్ది వేడుకలకు హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అధికారికంగా ఇదే చివరి పర్యటన కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.