సక్సెస్ కోసం స్పైడర్ గ్యాంగ్…

205
Mahesh Babu's SPYder Release Confirmed
- Advertisement -

బ్రహ్మోత్సవం సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈనెలాఖరుకి సినిమా పూర్తవుచేయబోతున్నారు.మరి సుపర్‌ స్టార్‌ మహేష్ బాబు వరుసగా సినిమాలుతో మంచి స్పీడ్‌ మీద ఉన్నాడు. మరో రెండేళ్ల వరకూ మహేష్ కమిట్మెంట్స్ ఇచ్చేశాడనే విషయం తెలుస్తూనే ఉంది.మరోవైపు మే నెల నుంచి కొరటాల శివతో ‘భరత్ అను నేను’ పేరుతో కొత్త సినిమా మొదలు పెట్టేయనున్నాడు మహేష్.

అయితే మహేశ్ సినిమా కోసం ఫాన్స్ బాగానే ఎదురుచూస్తున్నారు. ఎంతలా అంటే దాన్ని కోసం వాళ్ళు నిత్యం ఆలోచిస్తూనే ఉంటున్నారు. ఏ చిన్న అప్ డేట్ వచ్చిన చాలా ఆత్రుత పడి మరి వింటున్నారు. మంచిది ఉంటే ఊహాలలో తేలుతున్నారు లేకుంటే నిరాశ పడుతున్నారు. ఈ మధ్య విన్న వార్త వాళ్ళని నిరాశ పరిచింది. ఎందుకంటే ఆ సినిమా విడుదల కొంచెం అనుకున్న డేట్ కంటే ఆలస్యంగా వస్తుంది. పై గా ఆగష్టు 15 కూడా రావడం కొంచం కష్టం అంటున్నారు.

Mahesh Babu's SPYder Release Confirmed

ఈ సినిమా కోసం దెబ్బ తిన్న పులిలా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ముందు వచ్చిన బ్రహ్మోత్సవం పూర్తిగా నిరాశ మిగిల్చింది దానితో మొత్తం ఆశలు అన్నీ స్పైడర్ పైన పెట్టుకున్నారు. దాని తో పాటుగా ఈ సినిమా కలయికకు ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటి అంటే స్పైడర్ డైరెక్టర్ మురుగదాస్ తెలుగులో తీసిన డైరక్టు సినిమా స్టాలిన్ అంతగా ఆకట్టుకోలేదు. డైరెక్టర్ యెస్ జె సూర్య నాని..కొమరం పులి రెండు తెలుగులో ఫ్లాప్ అయ్యాయి . ఇప్పుడు నటుడిగా మారిపోయి ఈ సినిమా లో విలన్ గా నటిస్తున్నారు. దీనితో తో హిట్ కొట్టాలి అని కసి తో ఉన్నాడు. అలానే సైనికుడు సినిమాకు సంగీతం ఇచ్చిన హరీష్ జయరాజ్ కు విజయం లేదు. మళ్ళీ తిరిగి మహేశ్ సినిమాకు వర్క్ చేస్తున్నాడు కాబట్టి.. సక్సెస్ కొట్టాలనే తపనలో ఉన్నాడు. ఆ విధంగా స్పైడర్ గ్యాంగ్ అంతా సక్సెస్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు.

Mahesh Babu's SPYder Release Confirmed

ఈ సినిమాలో వీ.ఎఫ్.ఎక్స్ క్వాలిటి కోసం టీమ్ చాలా స్టూడియోస్ తో కలిసి పని చేస్తుంది. అనుకున్న దాని కన్నా ఆలస్యం ఐనా మంచి ఔట్ పుట్ కోసం తీవ్ర స్థాయి లో పని చేస్తున్నారు అని తెలుస్తుంది. కానీ సాధ్యం ఐనంత వరకు తొందరగా విడుదల చేస్తాం అని స్పైడర్ టీమ్ మహేశ్ అభిమానులుకు మాట ఇస్తున్నారు.

- Advertisement -