- Advertisement -
హైకోర్టు సూచనలు, కమిటీ రిపోర్టు ప్రకారం హెరిటేజ్ బిల్డింగ్ కి ఇబ్బంది కలగకుండా కొత్త నిర్మాణాలు చేపట్టడంపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని తెలిపారు మంత్రి హరీష్ రావు. ఉస్మానియా ఆసుపత్రిపై నియమించిన చీఫ్ ఇంజినీర్ల కమిటీ తన రిపోర్టును త్వరగా ఇవ్వాలన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంసిఆర్ హెచ్ఆర్డిలో చీఫ్ ఇంజనీర్ల కమిటీతో భేటీ అయ్యారు హరీశ్. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -