98వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్స్ 2026)కు సంబంధించిన నామినేషన్లు ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ప్రకటించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఏ చిత్రాలు, ఏ కళాకారులు తుది నామినేషన్ల జాబితాలో చోటు దక్కించుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది.
భారతదేశంలో అయితే ఈ ఉత్కంఠ మరింత ఎక్కువగా ఉంది. కారణం, ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారతదేశం తరఫున పోటీ పడుతున్న ‘హోమ్‌బౌండ్’ చిత్రం. కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చిన ఈ హిందీ చిత్రం బలమైన పోటీదారుగా మారి, సినీ అభిమానులు, పరిశ్రమ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది.
ఈ చిత్రానికి నీరజ్ ఘాయ్వాన్ దర్శకత్వం వహించగా, ఇషాన్ ఖట్టర్, విశాల్ జేత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఏడాది ఆస్కార్స్‌కు భారత్ అధికారికంగా పంపిన చిత్రంగా ‘హోమ్‌బౌండ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. తుది నామినేషన్ల అడ్డంకిని ఈ చిత్రం దాటుతుందా? అన్న ఆసక్తితో అభిమానులు ఎదురు చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా విడుదలైన తరువాత ఈ చిత్రానికి విస్తృత ఆదరణ లభించింది.
Also Read:మేడారం..హెలికాప్టర్ రైడ్స్ షురూ

