ప్రపంచ సినీ రంగంలో ఎంతో గొప్పగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమైంది. కరోనా వైరస్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఎట్టకేలకు ఈ రోజు ప్రారంభమైంది. లాస్ఏంజెలెస్ లోని డాల్బీ థియేటర్, యూనియన్ స్టేషన్లలో రెండు వేదికలపై వేడుక ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో సెలబ్రిటీలను మాత్రమే అనుమతిస్తున్నారు. కాగా, ‘నో మ్యాడ్లాండ్’ చిత్రానికి గాను క్లోవీ చావ్ ఉత్తమ దర్శకురాలుగా ఎంపికైంది.
ఆస్కార్ అవార్డ్ అందుకున్న తొలి మహిళగా క్లోవీ చావ్ చరిత్ర సృష్టించారు. ది హర్ట్ లాకర్ దర్శకుడు కాథరిన్ బిగెలో తర్వాత ఆస్కార్ చరిత్రలో అవార్డును గెలుచుకున్న రెండవ మహిళ కూడా ఈమెనే. అలాగే ఉత్తమ సంగీతం, ఉత్తమ సహాయ నటుడు అవార్డులను కూడా ప్రకటించారు. ‘సౌండ్ ఆఫ్ మెటల్’కు ఉత్తమ సంగీతం, ‘జుడాస్ అండ్ ది బ్లాక్ మిస్సయా’ ఫేమ్ డానియెల్ కలువోయా ఉత్తమ సహాయనటుడిగా ఎంపికయ్యారు. మిగతా విభాగాల్లోనూ మరికాసేపట్లో విజేతలను ప్రకటించనున్నారు.