ఆస్కార్ ప్రజెంటర్‌గా దీపికా….

14
- Advertisement -

పఠాన్ సినిమాతో వివాదంలోకి వెళ్లిన దీపికా…కానీ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె ప్రజెంటర్‌గా పాల్గొననున్నట్టు ప్రకటించారు. ఎమిలీ బ్లంట్ మైఖేల్ బిజోర్డాన్ శామ్యూల్ ఎల్‌ జాక్సన్ డ్వేన్ జాన్సన్ జోయ్‌ సాల్డాన్ వంటి ప్రముఖ హాలీవుడ్‌ నటులతో కలిసి దీపికా స్టేజ్‌ పంచుకోనున్నారు. ఇదే విషయాన్ని దీపికా ఇన్‌స్టా వేదికగా తెలియజేశారు. ఇంతగొప్ప గౌరవాన్ని సొంతం చేసుకున్నందకు ఆనందం వ్యక్తం చేశారు.

మార్చి 12న జరగనున్న ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ వేడుక జరగనుంది. హాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేయనున్నారు. కాగా మన దేశం నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం ఇందులో పాల్గొననుంది. నాటునాటు పాట ఉత్తమ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యింది. అయితే ఈ పాటను ఆస్కార్ వేదికగా స్టేజ్‌పై లైవ్‌లో కాలభైరవ రాహుల్‌ ఆలపించనున్నారు. ఇంతకు ముందే గోల్డెన్ గ్లోబ్‌ అవార్డు నాటు నాటు సాంగ్‌కు వరించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

టార్గెట్ అవుతున్న ఎన్టీఆర్?

చరణ్ ఎమోషనల్.. ఎన్టీఆర్ అవార్డు పై గోల

‘ట్రెండింగో’.. సాంగ్ లాంఛ్

- Advertisement -