చరణ్ ఎమోషనల్.. ఎన్టీఆర్ అవార్డు పై గోల

10
- Advertisement -

అమెరికాలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను చూసిన ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి రామ్ ‌చరణ్ ఎమోషనల్ అయ్యాడు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ని షేర్ చేశాడు. “ఏస్ హోటల్‌లో #RRR స్క్రీనింగ్‌కి చాలా మంచి స్పందన వచ్చింది! అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీ అందరి నుంచి ఇలా స్టాండింగ్ ఒవేషన్ అందుకోవడం నా మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతుంది!! అందరికీ ధన్యవాదాలు” అని చరణ్ ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు.

రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా అవార్డులతో ఓ ఊపు ఊపుతుంది. అయితే, సోషల్ మీడియాలో సినీ తారల ఫ్యాన్స్ మధ్య వార్ జరగడం మామూలే. ఐతే హెచ్‌సీఏ అవార్డుల ప్రదానోత్సవంతో మరింత అగ్గి రాజేసినట్లైంది. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను విమర్శిస్తూ హెచ్‌సీఏ కి మద్దతుగా.. భారతీయ చిత్రానికి హెచ్‌సీఏ అవార్డులు ఇవ్వడం ఇదే ఆఖరిసారి కావొచ్చు అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.

దాంతో హెచ్‌సీఏ కౌంటర్ ట్వీట్ ఇచ్చింది. ఎన్టీఆర్‌కు అవార్డులు వస్తూనే ఉంటాయి. ఆయన దానిని అందుకోలేకపోయారు అంటూ ట్వీట్ చేసింది. అలాగే వచ్చే వారం ఎన్టీఆర్ కి అవార్డును సెండ్ చేస్తాం అంటూ తన ట్వీట్ లో హెచ్‌సీఏ మెసేజ్ ను పోస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -