ప్రియా ప్రకాష్ వారియర్..పరిచయం అక్కర్లేని పేరు. ఒకే ఒక కనుసైగతో యువతను తనవైపు తిప్పుకుని రాత్రికి రాత్రే స్టార్ ఇమేజ్ను సంపాదించుకుంది. ‘ఒరు ఆదార్ లవ్’ అనే మలయాళ చిత్రంలోని ‘మాణిక్య మలరాయ పూవీ’ అనే పాటతో పలికించిన హావభావాలు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతు యువకుల మనసులను దోచుకుంది.
ఈ దెబ్బతో అమ్మడు రేంజ్ ఎక్కడికో వేళ్లిపోయి అవకాశాలు వాటంతట అవే దూసుకొస్తున్నాయి. దక్షణాది సినీ పరిశ్రమ మొత్తం తన వైపు చూస్తోంది. కాగా ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సిఉండగా వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.
తాజాగా ‘ఒరు అదార్ లవ్’ సినిమా తమిళ పాట టీజర్‌ను ప్రియ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఇందులో ప్రియ, రోషన్ ఒకరినొకరు చూసుకుని.. తెగ సిగ్గుపడుతూ కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాను సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు చిత్ర నిర్మాతలు.